నేత్రపర్వంగా ధర్మపురి నారసింహుని రథోత్సవం

ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, వేంకటేశ్వర స్వామి ,రామలింగేశ్వర స్వామి వార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తొలుత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం వద్ద నుంచి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, వేంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను రథంపై ఆశీనులను చేశారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. రథంపై కొలువుదీర్చిన స్వామివార్లను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. రథోత్సవం ఆలయం వద్ద ప్రారంభమై….పురవీధుల మీదుగా నంది చౌరస్తాకు చేరుకుంది. భక్తుల జయజయ ధ్వానాల నడుమ తిరిగి ఆలయం వద్దకు చేరుకుంది. ధర్మపురి పురవీధులన్నీ గోవింద నామంతో మార్మోగాయి.

Share this post with your friends