పోలీస్ స్టేషన్ కు వచ్చిన దేవుడు !

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకే ఒకచోట పోలీస్ స్టేషన్ లో దేవుడు పూజలందుకుంటాడు. అదెక్కడో కాదు..ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ క్రతువు జరుగుతుంది. వేలాది మంది భక్తులు వెంటరాగా, సాంస్కృతిక కళాప్రదర్శనలతో, డప్పు వాయిద్యాలతో పురవీధుల నుంచి శోభాయాత్ర నిర్వహించారు.దక్షిణ ద్విగ్యాత్రలో భాగంగా శ్రీ ఉగ్ర ,యోగ లక్ష్మీ నరసింహ స్వామి వారు ధర్మపురి ఠాణాను సందర్శించారు. ఠాణా సిబ్బంది… ప్రధాన ద్వారం వద్ద స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో నరసింహునికి అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. పురాతన కాలంలో ఈ స్టేషన్ పరిసరాల్లో ఓ వృక్షం కింద స్వామివారు వచ్చి పూజలు అందుకునే వారు. అయితే కాలాంతరంలో ఆ స్థలం ఠాణాగా మారిపోవడంతో మూడు దశాబ్దాలుగా అక్కడే స్వామివారు పూజలందుకుంటున్నారు.

Share this post with your friends