శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 28 నుంచి బుగ్గోత్సవాలు

ఏప్రిల్ 28 శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో వైభవంగా మూడు రోజుల పాటు బుగ్గోత్సవాలు జరుగనున్నాయి. ఈ బుగ్గోత్సవాలు ఏప్రిల్ 30 వరకూ కొనసాగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పవిత్ర ఉత్సవాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న బుగ్గ పుష్కరిణి వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని వేంచేపు చేస్తారు. అనంతరం పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 28 నుంచి బుగ్గోత్సవాలు
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 28 నుంచి బుగ్గోత్సవాలు

అనంతరం మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఉభయనాంచారులతో కలిసి స్వామివారి ఊంజలసేవ నిర్వహించి, అనంతరం బుగ్గ వద్ద భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. తదనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఆస్థానం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ బుగ్గోత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందాలని టీటీడీ ఆహ్వానిస్తోంది.

Share this post with your friends