భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్ష పాడ్యమి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కూడా దేవస్థానంలో రామనవమి బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ నిర్వహించనుంది. ఈ మేరకు ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల తేదీలను వైదిక కమిటీ ప్రకటించింది. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 23 వరకు నిర్వహించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న స్వామివారి కల్యాణం జరగనున్నాయి. రాములోరి పట్టాభిషేకం ఏప్రిల్ 18న నిర్వహించనున్నట్లు కమిటీ ప్రకటించింది.

* ఏప్రిల్ 13 – మండల రచన, కుండ, కలశం, యాగశాల, అలంకారాలు, సార్వభౌమ వాహన సేవ ఉంటుంది.

* ఏప్రిల్ 14న – గరుడ ధ్వజపత లేఖనం, దండయాత్ర, గరుడాధివాసం, 15న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరితాదానం, దేవతావనం, బలిసమర్పణ, హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.

* ఏప్రిల్ 16 – యాగశాల పూజ, చతుఃస్థానార్చన, ముఖాలు.

* ఏప్రిల్ 17 – శ్రీరామ నవమి సీతారాముల కల్యాణం, శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం.

* ఏప్రిల్ 18 – మహాపట్టాభిషేకం.

* ఏప్రిల్ 19 – మహదాశీర్వచనం.

* ఏప్రిల్ 20 – తెప్పోత్సవం, డోలోత్సవం.

* ఏప్రిల్ 21 – ఊంజల్ సేవ.

* ఏప్రిల్ 22 – వసంతోత్సవం.

* ఏప్రిల్ 23 – చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం మరియు శ్రీ పుష్పయాగం తర్వాత బ్రహ్మోత్సవం ముగుస్తుంది.

* ఏప్రిల్ 9 నుంచి 23 వరకు సాధారణ కల్యాణ, దర్బార్ సేవలు రద్దు చేస్తున్నట్టు వైదిక కమిటీ ప్రకటించింది.మే 1 వరకు పవళింపు సేవలు జరగవని స్పష్టం చేశారు.

అయితే గత బీఆర్‌ఎస్‌ హయాంలో రాములోరి సంక్షేమం సక్రమంగా జరగలేదు. ముత్యాల తలంబ్రాలు కాదు.. కనీసం పట్టువస్త్రాలు కూడా పంపలేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ప్రభుత్వం మారడంతో.. రాములోరి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాములవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన విషయం తెలిసిందే..

Share this post with your friends