నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలుత స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని అశ్వ వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. అశ్వ వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు.
2024-03-31