ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహస్వామి గరుడ వాహనంపై విహరించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంలో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. చెంచులు ప్రత్యేక వేషధారణలో చేసిన విన్యాసాలు అలరించాయి. మఠం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్, ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్, ఆలయ ప్రత్యేకాధికారి సేతురామన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు.
2024-03-27