సౌమ్యనాథ స్వామి స్థల పురాణం ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా నందలూరులో ఈ సౌమ్యనాథ స్వామి క్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఓసారి నారద మహర్షి కోరిక మేరకు నారాయణుడు భూలోక వింతలు చూసేందుకు బయల్దేరగా.. పరిసర ప్రాంతాలకు చేరుకున్నప్పుడు ఇక్కడి వాతావరణాన్ని చూసి స్వామి ముగ్ధుడయ్యాడట. దానిని గమనించిన నారదుడు.. స్వామి వారిని కలియుగంలో ఈ ప్రాంతంలోనే కొలువై భక్తులను కాపాడమంటూ ప్రార్థించాడట. అప్పుడు నారాయణుడు ఒకప్పుడు నెలందలూరుగా పిలిచే ఈ ప్రాంతంలోనే శిల రూపం దాల్చాడని చెబుతారు.

సౌమ్యనాథ స్వామి స్థల పురాణం ఏంటంటే..
సౌమ్యనాథ స్వామి స్థల పురాణం ఏంటంటే..

ఈ విషయం తెలిసిన దేవతలు ఇక్కడ చెయ్యేరు నది ఒడ్డున దేవాలయాన్ని నిర్మించారట. ఆ ఆలయంలో నారదుడు స్వామివారి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించాడట.

క్రమంగా ఈ దేవాలయం శిథిలమైపోయిందట. 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు ఈ గుడి నిర్మాణానికి పూనుకున్నాడట. అలా పునఃప్రారంభమైన ఈ క్షేత్ర నిర్మాణంలో కాకతీయ, పాండ్య విజయనగర రాజులు సైతం భాగమయ్యారని చరిత్ర చెబుతోంది. విశాలమైన ప్రాంగణంలో నాలుగు రాజగోపురాల మధ్య పది ఎకరాల విస్తీర్ణంలో, పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి ఈ గుడిని నిర్మించారు. ఇక్కడ 108 స్తంభాలుంటే అన్నింటిపైనా భాగవతం రచించి ఉంటుంది.

Share this post with your friends