పొంగు శనీశ్వర దేవాలయ చరిత్ర ఏంటంటే..

తమిళనాడు తిరువారూర్ జిల్లాలోని తిరుక్కొళ్లికాడులోని పొంగు శనీశ్వర ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా శివాలయంలోని శివలింగాలన్నీ దాదాపుగా నలుపు రంగులోనే ఉంటాయి. కానీ ఇక్కడ వెలిసిన అగ్నీశ్వరర్ మాత్రం అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తాడు. ఇక పార్వతీదేవి మృదుపద నాయకిగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ క్షేత్రంలో మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే.. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడా లేని విధంగా దనుర్భాణంతో దర్శనమిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలతో పాటు కాలభైరవ స్వామి కొలువుదీరాడు.

పొంగు శనీశ్వర దేవాలయ చరిత్ర ఏంటంటే..
పొంగు శనీశ్వర దేవాలయ చరిత్ర ఏంటంటే..

సాధారణంగా ఇతర ఆలయాల్లో నవగ్రహాలు తలో దిక్కుగా ఉంటాయి. కానీ ఈ ఆలయ విశేషం ఏంటంటే.. నవగ్రహాలు ఎదురెదురుగా ఉంటాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో శివునికి బిల్వ దళాలతో పూజించినట్లుగానే.. శనిని పూజించేందుకు జమ్మి చెట్టు ఉంటుంది. ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి సోమ, శనివారాల్లో వివేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి సమయంలో ఇసుకేస్తే రాలనంత మంది ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో శని జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వీటిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. ఈ ఆలయానికి వెళ్లాలంటే.. తమిళనాడు తిరువరూర్ రైల్వే స్టేషన్ నుంచి అరగంట ప్రయాణం చేస్తే తిరుక్కొళ్లికాడు వస్తుంది.

Share this post with your friends