హనుమాన్ పూజ చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు..

ఇవాళ హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా సర్వత్రా స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. అయితే అందరూ దేవాలయానికి వెళ్లలేక పోవచ్చు. కొందరు ఇంట్లోనే అంజనీ పుత్రునికి పూజ చేసుకుని తమ పనులు చూసుకుంటారు. ఇంట్లో పూజ చేసుకునే వారు తప్పక కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. విరిగిపోయిన లేదంటే చిరిగిపోయిన హనుమంతుని చిత్ర పటానికి పూజలు చేయకూడదు. ఆ పటాలను దేవాలయంలో పెట్టడం కానీ లేదంటే పవిత్ర నదిలో నిమజ్జనం చేయడం కానీ చేయాలి. అనంతరం మంచి హనుమంతుడి విగ్రహాన్ని లేదంటే చిత్రపటాన్ని కొని తెచ్చుకుని పూజ చేయాల్సి ఉంటుంది.

అలాగే పంచామృతాన్ని హనుమంతుడికి నేవైద్యంగా అస్సలు ఇవ్వకూడదు. అభిషేకాలు వంటివి హనుమంతుడికి ఇష్టం ఉండదు కాబట్టి అలాంటివి చేయకూడదు. హనుమంతుని పూజా సమయంలో తెలుపు లేదంటే నలుపు రంగు దుస్తులను ధరించడం శ్రేయస్కరం కాదు. ఇక ఏం చేయాలంటే.. హనుమంతుడికి చాలా ఇష్టమైన సింధూర లేపనం చేయవచ్చు. అలాగే స్వామివారికి తమలపాకులంటే కూడా చాలా ప్రీతికరం. కనుక తమలపాకు దండలను వేస్తే ఇష్టంగా స్వీకరిస్తాడు. హనుమంతుడికి ఎరుపు, నారింజ, పసుపు రంగులంటే చాలా ఇష్టం. ఆ దుస్తులు వేసుకుని పూజ చేస్తే స్వామివారి కరుణా కటాక్షాలు దక్కుతాయి.

Share this post with your friends