పెరుగు అన్నం (Curd Rice)

✦ శనివారం రోజు కుల దేవతలకు పెరుగు అన్నం నైవేద్యంగా పెడితే అప్పులు బాధలు తొలగిపోతాయి.
✦ శుక్రవారం సాయంత్రం మహాలక్ష్మి పూజను చేసి పెరుగు అన్నాన్ని నైవేద్యంగా పెట్టి పెరుగు అన్నాన్ని ప్రసాదము పెడితే ఇంట్లో ధన వృద్ధి కలుగుతుంది.
✦ పెరుగు అన్నం మిరపకాయ, ఎండుమిరపకాయ, ఉప్పు, వేసి నైవేద్యంగా పెడితే ఇంట్లో గొడవలు, రోగబాధలు, అప్పులబాధలు, శత్రువులబాధలు ఎక్కువ అవుతాయి.
✦ పెరుగు అన్నానికి దానిమ్మ పండు గింజలను కలిపి కుల దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తే వారికి శత్రువుల బాధ తొలగి తేజస్సు కలుగుతుంది.
✦ పెరుగు అన్నంలో తేనె వేసి శ్రీవిష్ణు సహస్రనామం లక్ష్మీసహస్రనామం పఠిస్తూ పూజ చేసి, దంపతులకు ఆ పెరుగు అన్నాన్ని దానం చేస్తే అన్నిరోగాలు తొలగిపోతాయి.
✦ పెరుగు అన్నానికి మిరియాల పొడివేసి కలిపి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టి దానిని దానం చేసినచో చర్మవ్యాధులు తొలగిపోతాయి.
✦ పెరుగు అన్నానికి ఎండు ఖర్జూరాన్ని కలిసి కులదేవతలకు నైవేద్యంగా చేసి, దానం చేస్తే వారికి ఎప్పుడూ డబ్బుకు సమస్య కలగదు.

Share this post with your friends