శ్రీరామనవమి రోజు సాయంత్రం ఇలా చేస్తే కలిగే లాభాలను కల్లో కూడా ఊహించలేరు..

sri ram temple
శ్రీరామనవమి రోజున సాయంత్రం కొన్ని పనులు తప్పక చేస్తే జీవితంలో అద్బుతాలు ఖాయమట. ధన లాభం కోసం.. సంతానం కోసం, శాంతి, ఆరోగ్యం, వివాహ యోగం వంటి పనులు నవమి రోజు మనం చేసే కొన్ని పనులతో తప్పక నెరవేరుతాయట. శ్రీరామనవమి రోజున సాయంత్రం వేళ ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని వాటిలో ‘ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః’ అనే రామరక్ష మంత్రాన్ని 108 సార్లు రాసి.. ఆ జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లాలి. అలా చేస్తే ఆర్థిక లాభం కలుగుతుందట. అలాగే ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయను చుట్టి సీతమ్మకు సమర్పించాలి. అనంతరం ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సంతాన యోగం కలుగుతుందట.

నవమి రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు ‘ఓం హనుమతే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలట. ఇలా చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుందట. అలాగే నవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమలతో పాటు గంధాన్ని సమర్పించాలి. అనంతరం ‘ఓం జై సీతా రామ్’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వివాహ అడ్డంకులు తొలుగుతాయని అంటారు. ఇక దేవాలయం ఎదురుగా ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించి.. ‘శ్రీరామ్ జై రామ్ జై జై రామ్’ అని 108 సార్లు జపిస్తే జీవితంలో ప్రశాంతతోపాటు ఆనందం కలుగుతుందట.

Share this post with your friends