జగదానందకారకుని కల్యాణ మహోవత్సవం ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరగనుంది. భక్తులు శ్రీరాముని అనుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజలు ఆ రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఇక భద్రాచలంలో ఆరు బయట భక్తులందరికీ సౌకర్యవంతంగా మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరాముడిని ఆరాధిస్తే జీవితంలోని అన్ని బాధలూ తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక రాముల వారి పూజకు ఆ రోజున ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:38 వరకూ మంచి సమయం.
ఇక నవమి తిథి ఏప్రిల్ 16నే ప్రారంభం కానుంది. 16న మధ్యాహ్నం 1:23 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం 3:14 గంటలకు ముగుస్తుంది. కాబట్టి నవమిని 17న నిర్వహిస్తున్నారు. ఇక శ్రీరామనవమి రోజున మనం చేసే పూజల ఫలితంగా మంచి ఫలితం పొందాలంటే చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మద్యం, మాంసం వంటి వాటిని ముట్టకూడదు. చెడు ఆలోచన మనసు నుంచి తీసేయాలి. అందరితో ప్రేమగా ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. కోపాన్ని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. ఎవరికీ హాని తలపెట్టే పనులు చేయవద్దు.