హిందూ ధర్మంలో రాగిని అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణిస్తారు. కాబట్టి ఏ పనికైనా రాగి చెంబును వినియోగిస్తూ ఉంటారు. ఇంట్లోకి రాగి పాత్రలు తెచ్చిన వెంటనే రాగితో శుభ్రం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందని నమ్మకం. అలాగే పాలను దాదాపు ప్రతి పూజలోనూ వినియోగిస్తారు. రాగి ఆరోగ్యానికి సైతం మంచిది కావడంతో ప్రతి పనిలోనూ వినియోగిస్తూనే ఉంటాం. అయితే దీనిని ప్రతి పూజలోనూ వాడినా అనర్ధమే. ఎందుకంటే రాగి కొన్ని పదార్థాలతో ప్రతిచర్య జరుపుతుంది కాబట్టి అన్నీటికీ వినియోగించకూడదు. రాగి వినియోగానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ముఖ్యంగా పాలు ఏ వస్తువు నుండైనా నెగటివ్ ఎనర్జీని ఇట్టే గ్రహిస్తాయి. రాగి చెంబులో పాలను పోసినప్పుడు దాని చుట్టూ ఏదైనా అశుద్ధం ఉంటే అది ఇట్టే పాలతో కలిసిపోయి అపవిత్రమవుతాయి. వాటితో శివలింగాన్ని అభిషేకించడం సరికాదు. ఒకరకంగా రాగి చెంబులోని పాలు మద్యంతో సమానంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వాటిని శివలింగానికి సమర్పించడం దోషంగా పరిగణిస్తారు. మహా శివరాత్రి సమీపిస్తోంది. ఆ రోజున శివలింగానికి స్వచ్ఛమైన పాలతో అభిషేకం చేయడం చాలా మంచిది. కాబట్టి రాగి చెంబులో పాలు పోసి అభిషేకం చేయకూడదు. వేరే ఏ లోహాన్ని వినియోగించినా మంచిదే.