ఇంట్లో అయినా ఆలయంలో అయినా పూజ చేసుకుంటున్నామంటే కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు కనిపిస్తే ఆనందం.. కుళ్లిపోతే ఏదో అశుభం జరగబోతోందని ఆందోళన చెందుతుంటారు. అయితే ఏమాత్రం భయపడనక్కర్లేదని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయ కుళ్లిపోవడమనది శుభసూచికమేనట. ముఖ్యంగా దిష్టి తీసే సమయంలో కొబ్బరికాయ కుళ్లిపోతే మరీ మంచిదని చాలా మంది భావిస్తుంటారు. ఇంట ఏదో అశుభం జరుగుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు.
పూజల్లో భాగంగా కొబ్బరికాయను కొట్టినప్పుడు పువ్వు వచ్చినా, కుళ్లిపోయినా భయపడాల్సిందేమీ లేదని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయకు ఉండే మూడు కన్నులకు శాస్త్రంలో ఒక ప్రత్యేకత ఉంది. దీనిని ‘నారికేళ సముద్భూత త్రినేత్ర హరసమ్మత – శిఖయా దురితం సర్వం పాపం పీడాంచ మేనుద’ అని పేర్కొంటారు. అంటే మనకు ఎప్పటికీ యవనాన్ని ప్రసాదించేదని అర్థం.కొబ్బరికాయ ఎప్పటికీ కాయగానే ఉంటుంది. కొబ్బరికాయను భగవంతునికి నైవేద్యంగా సమర్పించే సమయంలో కుళ్లిపోతే ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదట.