వందల ఏళ్లనాటి ప్రసిద్ధిగాంచిన నాగ వాసుకి ఆలయం ఎక్కడుందంటే..

గంగా, యమునా, సరస్వతి నదుల కలయికను త్రివేణి సంగమమని అంటారు. ఈ త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. ఇక్కడ ఎన్నో రహస్యాలు నిగూఢమై ఉన్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న అనేక ప్రత్యేకమైన, చారిత్రక ఆలయాల్లో నాగ వాసుకి ఆలయం కూడా ఒకటి. దారాగంజ్‌లోని గంగా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో శివుని నాగులకు రాజు అయిన వాసుకి కొలువై ఉంటుంది. అమృతం కోసం జరిగిన సాగర మథనానికి ఈ ఆలయంతో ఒక సంఘటనకు ఈ ఆలయానికి సంబంధం ఉందని చెబుతారు.

ఈ ఆలయం కొన్ని వందల ఏళ్లనాటిదని చెబుతారు. అయితే ఆ తరువాతి కాలంలో దీనిని పునరుద్దరించారు. ఈ ఆలయంలో నాగ వాసుకి విగ్రహాన్ని ప్రతిస్టించారు. ఈ విగ్రహం చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా నాగ పంచమి వచ్చిందంటే చాలు ఈ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. వాసుకిని పూజించుకునేందుకు.. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ వాసుకిని పూజిస్తే సర్ప దోషాల వంటివి ఏమైనా ఉంటే ఉపశమనం లభిస్తుందట. అంతేకాకుండా జాతకంలో కాలసర్ప దోషం ఏమైనా ఉంటే ఆ ప్రభావం కూడా తగ్గుతుందని చెబుతారు.

Share this post with your friends