తపస్సు చేసినా సాధ్యం కాని మోక్షాన్ని ప్రసాదించే కన్నయ్య ఎక్కడున్నాడంటే..

జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు వెలిసిన దివ్యక్షేత్రాల్లో గురువాయూర్ ఒకటి. ద్వాపరయుగం చివరలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు సైతం అక్కడి నుంచి మాయమయ్యాడట. అక్కడ మాయమైన కన్నయ్య సముద్ర జలాలపై తేలుతూ కనిపించడంతో దేవతల గురువైన బృహస్పతి, వాయుదేవుడు కలిసి కృష్ణుని విగ్రహాన్ని గురువాయూర్‌కు తీసుకొచ్చి ప్రతిష్టించారట. అందుకే ఈ గురువాయూర్ క్షేత్రం భూలోక వైకుంఠంగా ఖ్యాతి చెందింది. కొన్ని వేల సంవత్సరాలుగా కన్నయ్య పూజలందుకుంటున్నాడు.

తపస్సు చేసినా సాధ్యం కాని మోక్షాన్ని ప్రసాదించే కన్నయ్య ఎక్కడున్నాడంటే..
తపస్సు చేసినా సాధ్యం కాని మోక్షాన్ని ప్రసాదించే కన్నయ్య ఎక్కడున్నాడంటే..

సాధారణంగా ఎంతో కఠిన తపస్సు చేస్తే గాని సాధ్యం కానీ మోక్షం గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించినంత మాత్రానే లభిస్తుందట. కేరళ రాష్ట్రం త్రిశూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గురువాయూర్ ఉంటుంది. దీనికి గురువాయూర్ అనే పేరు రావడం వెనుక ఒక కారణముంది. దేవతల గురువు అయిన బృహస్పతి, వాయుదేవుడు ఇద్దరూ కలిసి ఇక్కడ శ్రీకృష్ణుడిని ప్రతిష్టించారు కాబట్టి ఈ క్షేత్రానికి గురువాయూర్ అని పేరు వచ్చింది. ద్రవిడ భాషలో ‘అప్ప’ అంటే తండ్రి అని అర్ధం. కన్నయ్యను తండ్రిల భావించడంతో పాటు గురువు, వాయువుల పేర్లతో వెలసిన పరబ్రహ్మం కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడిని గురువాయూరప్ప అంటారు. ఈ క్షేత్రం దక్షిణ ద్వారకగా ప్రసిద్ధి గాంచింది.

Share this post with your friends