ప్రపంచంలోనే అతి పెద్ద అన్నప్రసాద కేంద్రానికి వెంగమాంబ పేరు? అసలు ఎవరీమె?

తిరుమలకు వెళ్లామంటే మనకు భోజన ఖర్చు అయితే ఉండదు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకూ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం మనకు నిరంతరాయంగా భోజన సదుపాయాలు కల్పిస్తోంది. రోజూ లక్షలాది మందికి అన్నప్రసాద వితరణ అంటే మామూలు మాటలు కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద అన్నప్రసాద కేంద్రంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం పేరుగాంచింది. ఇంతటి ఖ్యాతి పొందిన ఆ తరిగొండ వెంగమాంబ వర్థంతి మహోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలు తెలుసుకుందాం.

తరిగొండ వెంగమాంబ మంచి కవయిత్రి. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర స్వామికి అపర భక్తురాలు. క్రీ.శ 1730లో చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతులకు శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వలన వెంగమాంబ జన్మించింది. స్వామివారి కరుణాకటాక్షాలతో జన్మించింది కాబట్టి ఆమెకు వెంగమాంబ అని పేరు పెట్టారు. వెంగమాంబ చిన్ననాటి నుంచే శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తి ధ్యానాలలో ఉండేది. చిన్న వయసులోనే భక్తి పాటలు రచించి.. ఆలపించేంది. పదేళ్ల వయసులోనే ఆమెకు వేంకటాచలపతితో వివాహం జరిగింది. అయితే వివాహమైన కొన్నాళ్లకే భర్త మరణంతో తిరిగి పుట్టింటికి వచ్చి.. నియమాలకు విరుద్ధంగా ముత్తైదువుగానే అన్ని అలంకరణలు చేసుకునేది.

Share this post with your friends