తిరుప్పేర్‌నగర్ క్షేత్రంలోని మృత్యు వినాశిని తీర్థం స్థల పురాణమేంటంటే..

మార్కండేయుడు పుట్టుకతోనే అల్పాయుష్కుడు. అతనికి కేవలం 16 ఏళ్ల ఆయుష్షు మాత్రమే ఉంది. ఆ విషయాన్ని తల్లి నుంచి తెలుసుకున్న మార్కండేయుడు శివుని గురించి తపస్సు చేసుకోవడానికి ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. నారదుని ఆశీర్వాదంతో శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివపూజ చేస్తూనే ఏళ్ల పాటు తపస్సు చేశాడు. అలా అతనికి 16 ఏళ్ల వయసు వచ్చింది. మార్కండేయుని ప్రాణాలను తీసుకెళ్లేందుకు యమధర్మరాజు పాశాలతో వచ్చాడు. తాను పూజిస్తున్న శివలింగాన్ని మార్కండేయుడు గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు.

తిరుప్పేర్‌నగర్ క్షేత్రంలోని మృత్యు వినాశిని తీర్థం స్థల పురాణమేంటంటే..
తిరుప్పేర్‌నగర్ క్షేత్రంలోని మృత్యు వినాశిని తీర్థం స్థల పురాణమేంటంటే..

యముడు విసిరిన పాశం బాల మార్కండేయునితో పాటు శివలింగాన్ని సైతం అది చుట్టుకుంటుంది. తన భక్తుడిని హింసించడంతో పాటు తనపైకే పాశం విసిరాడన్న కోపంతో శివుడు యముడి పైకి తన త్రిశూలాన్ని విసిరాడు. శివుని త్రిశూలం యమ ధర్మరాజును ముల్లోకాలూ తరమసాగింది. చివరకు దేవతలంతా కలిసి శివుడిని యముడికి క్షమాభిక్ష పెట్టమంటూ వేడుకోవడంతో క్షమించి విడిచి పెట్టాడు. తన భక్తుల జోలికి రావద్దని యముడిని శివుడు గట్టిగా హెచ్చరించాడు. అనంతరం బాల మార్కండేయుడిని ప్రేమగా శివుడు దగ్గరకు తీసుకున్నాడట. చిరంజీవిగా వర్థిల్లుతావని ఆశీర్వదించాడట. అనంతరం మార్కండేయుడు వెళ్లి మృత్యు వినాశిని తీర్థంలో స్నానమాచరించాడని తిరుప్పేర్ నగర్ క్షేత్ర స్థల పురాణం చెబుతోంది.

Share this post with your friends