ఇక్కడి విష్ణుమూర్తికి అప్పకుడత్తాన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే..

108 దివ్య తిరుపతులలో ఒకటైన ‘తిరుప్పేర్ నగర్’ క్షేత్రాన్ని పిలుస్తారు. దీనిని ‘బృహత్పురి’ అని కూడా పిలుస్తారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఇక్కడ ‘అప్పకుడత్తాన్’గానూ.. అమ్మవారు కమలవల్లీ తాయారుగానూ పూజలందుకుంటున్నారు. 12 మంది ఆళ్వార్ సంతులు నాలాయిర దివ్య ప్రబంధంలో స్తుతించిన వైష్ణవ ఆలయాల్లో తిరుప్పేర్ నగర్ క్షేత్రం కూడా ఒకటి. కావేరీ నదీ తీరంలో పంచరంగ క్షేత్రాలున్నాయి. వాటిలో ఇది కూడా ఒకటిగా పేర్కొంటారు.

ఇక్కడి విష్ణుమూర్తికి అప్పకుడత్తాన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే..
ఇక్కడి విష్ణుమూర్తికి అప్పకుడత్తాన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే..

ఇక్కడి విష్ణుమూర్తికి అప్పకుడత్తాన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇక్కడ వెలసిన పెరుమాళ్ కు ‘అప్పాలు’ అంటే చాలా ఇష్టమని చెబుతారు. అందువల్లనే ఆయనకి అప్పకుడత్తాన్ అనే పేరు వచ్చిందని అంటారు. ఇక్కడే స్వామివారు పరాశర మహర్షికి ప్రత్యక్ష దర్శనమిచ్చాడని కూడా అంటారు. ఇక్కడి మృత్యు వినాశిని తీర్థంలోనే మార్కండేయుడు స్నానమాచరించి దీర్ఘాయువును పొందాడని కూడా చెబుతారు. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చిన వారంతా ఈ తీర్థ:లో స్నానమాచరిస్తూ ఉంటారు.

Share this post with your friends