TTD On Vaikuntha Dwara Darshan : వైకుంఠద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో… భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో… టీటీడీ భక్తులకు సౌకర్యంగా, సురక్షితంగా దర్శనం ఇవ్వడానికి చర్యలు తీసుకుంది. ప్రారంభ మూడు రోజులలో అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో స్లాటెడ్ ఈ-డిప్ టోకెన్ల ద్వారా 1.76 లక్షల భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. ఒక్కోరోజు స్లాట్లను 14 భాగాలుగా విభజించి… ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో దర్శనం చేసుకునే భక్తుల కోసం వేర్వేరు ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశారు. భక్తులు టోకెన్, ఆధార్ లేదా గుర్తింపు పత్రాలతో మాత్రమే ప్రవేశించాలి. పోలీస్, టీటీడీ సిబ్బంది సూచనలను పాటించాలి, గుంపుగా రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే అధికారులు తెలియజేయాలని టీటీడీ. సూచించింది.

TTD On Vaikuntha Dwara Darshan
TTD On Vaikuntha Dwara Darshan
Share this post with your friends