
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఎప్పుడు నిర్మితమైంది? ఆలయంలోని మండపాల మహత్స్యం గురించి తెలుసుకున్నాం కదా. శ్రీవారి ఆలయం 12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో అద్భుతంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆలయంలోని ప్రత్యేక గదులు, ఆయా గదుల్లో స్వామివారికి అందించే ప్రత్యేక సేవల గురించి తెలుసుకుందాం. తిరుమామణి మండపం – సుప్రభాత సేవలో భక్తుల భాగస్వామ్యం. స్నపన మండపం – పల్లవరాణి సామవై నిర్మించిన పవిత్ర స్థలం.
రాములవారి మేడ – సీతారామలక్ష్మణ విగ్రహాల నిలయం.
శయనమండపం – ప్రతిరోజూ ఏకాంత సేవలో స్వామివారి శయనం.
కులశేఖరపడి – గర్భాలయ ప్రవేశ ద్వారం.
గర్భాలయం (ఆనందనిలయం) – స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆవిర్భావ స్థలం, బంగారు విమానం ఇక్కడే.
మూల విగ్రహం – శ్రీ వేంకటేశ్వరస్వామి
గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా వెలసిన దివ్య రూపం.
స్థానకమూర్తి, ధ్రువబేరం అని ప్రసిద్ధి.
భక్తులకు శాశ్వత దర్శనానందం ప్రసాదించే ఆర్చామూర్తి.
తిరుమల శ్రీవారి ఆలయం, చరిత్ర, శిల్పం, ఆధ్యాత్మికత కలసి మన హృదయాన్ని దివ్యానందంతో నింపుతుంది.
