తిరుమలలో కల్తీ నెయ్యి వాడకంపై విచారణ ప్రారంభం..

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వాడారంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే దీని గురించి ఓ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి వాడకంపై నిజనిజాల నిర్ధారణకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ ప్రారంభించింది. ఇప్పటికే ఈ బృందం రెండు సార్లు సమావేశమైంది.ప్రస్తుతం కల్తీ నెయ్యికి సంబంధించిన ల్యాబ్ నివేదికలను ఈ బృందం పరిశీలిస్తోంది.

సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందం కల్తీ నెయ్యి వాడకంపై విచారించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని డైరెక్టర్‌ ఎస్‌.వీరేశ్‌ ప్రభుతో పాటు విశాఖపట్నంలో ఎస్పీగా పనిచేస్తున్న మురళి.ఆర్‌ను కల్తీ నెయ్యి విచారణకు సీబీఐ నియమించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖపట్నం రేంజి డీఐజీ గోపీనాథ్‌జెట్టిలు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. దీనిలో భాగంగా ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నుంచి ఒకరిని సభ్యునిగా నామినేట్‌ చేయాల్సి ఉంది.

Share this post with your friends