టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కమిషనర్ ప్రమాణం

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కమిషనర్ (ఎఫ్ఏసీ) శ్రీ కె.రామచంద్రమోహన్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీ కె.రామచంద్రమోహన్ కు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, పేష్కార్ శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends