తిరుమలలో తీర్థాలు, ఉప ఆలయాల నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె శ్యామలరావు అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని ఆకాశ గంగ, పాప వినాశనం, చక్ర తీర్థంలలో పార్కింగ్, లైటింగ్, పచ్చదనం, క్యూలైన్లు, సూచిక బోర్డులు, ఉప ఆలయాలలో ప్రసాద దిట్టం, పలు నిర్మాణ పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాల చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో కళ్యాణ కట్ట వెంకట్రామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ నేపథ్యంలో వివిధ పార్కింగ్ ప్రాంతాలను కేటాయిస్తోంది. తద్వారా ట్రాఫిక్ నిర్వహణనకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వైకుంఠ ఏకాదశి ముఖ్యాంశాలతో సమగ్ర మాస్టర్ డాక్యుమెంట్ ఇప్పటికే అధికారులు రూపొందించారు. దీనిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు అధికారులు వివరించారు. ఇది ప్రస్తుత, భవిష్యత్తు సంవత్సరాలకు అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందిజ అలాగే ప్రత్యేకమైన పౌరాణిక పాత్రలతో కూడిన పూల అలంకరణలు ఏర్పాటు చేయనున్నారు.