వారఫలం – 5th To 11th February, 2024

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ వారం ఆశాజనకం. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి. స్నేహితుల ప్రోద్బలంలో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సందేహాలు, అపోహలకు తావ్వివద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెళకువ వహించండి. వ్యాపకాలు అధికమవుతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచిదే. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కార్యక్రమాలకు హాజరవుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు లక్ష్యం చేరువలోనే ఉంది. మనోధైర్యంతో మెలగండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సమష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దంపతుల ఆలోచనల్లో మార్పు వస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషాన్నిస్తుంది. నూతన వ్యాపారాలు కలిసిరావు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్లకు పనిభారం. ఉద్యోగస్తులకు పనిభారం. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన. దూరప్రయాణాలు వాయిదా పడతాయి.

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఆర్థికలావాదేవీలు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. నగదు, స్వీకరణ, చెల్లింపుల్లో మెలకువ వహించండి. ఆది, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యపరీక్షల చేయించుకోవటం ఉత్తమం. సంతానానికి శుభయోగం. వాస్తుదోష నివారణ చర్యలు మంచి ఫలితాలిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకకు హాజరుకాలేరు.

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు. యత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. సోమవారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మీ శ్రీమతి వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. మానసికంగా కుదుటపడతారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు అనివార్యం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. యోగ, ఆధ్యాత్మికతల పట్ల ఆసక్తి పెంపొందుతుంది.

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. మనోధైర్యంతో మెలగండి. అతిగా ఆలోచింపవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గురు, శుక్రవారాల్లో దంపతుల మధ్య అకారణ కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆత్మీయులరాక ఉపశమనం కలిగిస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. సంతానం చదువులపై దృష్టి సారించండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుకు పనిభారం. అధికారులకు కొత్త బాధ్యతలు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1, 2 పాదాలు ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. మీ సమర్ధతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. అందరితో కలుపుగోలుగా మెలుగుతారు. పరిచయాలు బలపడతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. శనివారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు.

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు గ్రహాల సంచారం బాగుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెట్టుబడులకు తగిన సమయం. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పంద లభిస్తుంది. ఆది, సోమవారాల్లో పనులు ఒక పట్టాన సాగవు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పు యత్నాలు సాగిస్తారు. పత్రాలు, నగదు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, స్నేహాలు బలపడతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త.

వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు, ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదా మార్పు. వాహనదారులకు దూకుడు తగదు.

ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం వ్యవహారానుకూలత ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడగులు వేస్తారు. పరిచయాలు బలపడతాయి. నూతన యత్నాలు, పనులు ప్రారంభిస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయం స్వయంగా చూసుకోండి. ఖర్చులు అధికం. విలాసాలకు వ్యయం చేస్తారు. పొదుపునకు అవకాశం లేదు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆశించిన పదువులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచిదే. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. సంతానం ఉత్సాహాన్ని అదుపుచేయండి. ఉపాధ్యాయులకు పనిభారం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మీ కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధా కాదు. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. శుక్ర, శనివారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో ఇబ్బందులెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధి పథకా చేపడతారు. ఉపాధ్యాయులకు పనిభారం, విద్యార్థులకు ఒత్తిడి అధికం.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు సంకల్ప సిద్ధికి ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అతిగా ఆలోచింపవద్దు. పరిస్థితులు నిదానంగా కుదుటపడతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపునకు ఆస్కారం లేదు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విషయంలో శుభ ఫలితాలున్నాయి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో మెళకువ వహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు చికాకులు అధికం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.

మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని ఈ సలహాలిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెళకువ వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవదు.

Share this post with your friends