ఈ అమ్మవారి గురించి తెలిస్తే షాక్ అవుతారు..

దేశ వ్యాప్తంగా నవరాత్రుల సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని దేవాలయాల్లో నవరాత్రులకు సంబంధించిన ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఆలయాలన్నీ నవరాత్రి ఉత్సవాల కోసం అందంగా ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని అమ్మవారి ఆలయాల్లో దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి పాండవుల కులదేవి ఆలయం. ఈ ఆలయంలోని అమ్మవారి విశేషమేంటంటే.. ఏడాదంతా సాధారణంగా ఉండే అమ్మవారి విగ్రహ పరిమాణం నవరాత్రి సమయంలో మాత్రం తొమ్మిది రోజు పాటు విగ్రహ పరిమాణం పెరగుతూ ఉంటుంది.

మరో విశేషం ఏంటంటే.. నవరాత్రులలో తొమ్మిదో రోజు అయిన నవమి రోజున అమ్మవారి విగ్రహాన్ని గర్భగుడి నుంచి బయటకు తీస్తారు. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని మోరెనా సమీపంలోని కైలాస-పహర్‌ఘర్ రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలోని కొండలలో ఉంది. వనదేవత భవానీ ఆలయంగా దీనిని పిలుస్తారు. ఇక్కడి అమ్మవారిని ‘భరరేవాలి మాత’గా పిలుస్తారు. ఇక్కడి కులదేవి అమ్మవారిని పాండవులు వనవాస సమయంలో పూజించారని పురాణాలు చెబుుతన్నాయి. పాండవులు వనవాస సమయంలో ఇక్కడ కులదేవిని పూజించారని ఈ ఆలయం గురించి పురాణ కథనం. పూజ సమయంలో కులదేవి రాతిలోకి ప్రవేశించింది.ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహానికి కొత్త రూపం ఇవ్వాలని స్థానికులు ఎంతగానో యత్నించారట. కానీ ఫలితం శూన్యమని చెబుతారు.

Share this post with your friends