ఈ ఆలయంలోని వింత గురించి తెలిస్తే షాక్ అవుతారు..

ఏపీలోని ఏలూరులో ఉన్న ఒక ఆలయం గురించి వింటే షాక్ అవుతారు. కొన్ని ఆలయాల్లో చాలా మిస్టరీ దాగుందని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. ఎవరెంత యత్నించినా కూడా దానిని ఛేదించలేకపోవడం విశేషం. అలాంటి ఆలయాల్లో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం. ఏలూరు జిల్లా కలిదిండిలో అతి ప్రాచీన దేవాలయం ఒకటి ఉంది. ఆ ఆలయంలో శివుడు లింగాకారంలో కొలువై ఉన్నాడు. స్వయంభువుగా వెలిశాడని ఇక్కడి వారు చెబుతారు. ఇక్కడి శివయ్యను పాతాళ భోగేశ్వర స్వామి అని చెబుతారు.

ఈ ఆలయంలో ఓ విశేషం ఉంది. ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో పంచబుగ్గలు ఉన్నాయి. ముందుగా ఆలయానికి వెళ్లిన భక్తులు పాతాళ లింగేశ్వరుడిని దర్శించుకుంటారు. అనంతరం కోనేరు వద్దకు వెళ్లి హర హర అంటారు. అప్పుడు కానీ అసలు విషయం తెలియదు. మైండ్ బ్లాక్ అయ్యే ఘటన జరుగుతుంది. భక్తులు హర హర అనగానే కోనేరులోని పంచ బుగ్గల నుంచి నీరు బుడబుడా అని శబ్దం చేస్తూ పైకి వస్తుంది. అక్కడికి వెళ్లిన భక్తులంతా తప్పక హరహర అని ఆ వింతను చూసి వస్తుంటారు.

Share this post with your friends