మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదంటారు.. ఎందుకంటే..

ఏదైనా ఒక పెద్ద పనిని పూర్తి చేయాలంటే మనం ముందుగా తలచుకునేది ఆంజనేయ స్వామిని. ఆ పని చేయడానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తాడని నమ్మకం. హనుమంతుడిని పూజించే సమయంలో మహిళలు కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతారు. వాటిలో ఒకటి స్వామివారి విగ్రహాన్ని మహిళలు అస్సలు స్పృశించకూడదు. అయితే స్వామివారి మంత్రాలు ఎవరైనా పఠించవచ్చు. కానీ మహిళలు హనుమంతుడి విగ్రహాన్ని మాత్రం తాకడం. హనుమంతుడు అంతటి గొప్పవాడు కావడానికి ఆయన చేపట్టిన బ్రహ్మచర్య దీక్షేనని నమ్ముతారు. జీవితకాల బ్రహ్మచర్యాన్ని చేపట్టాడు.

కొన్ని అనుకోని పరిస్థితుల్లో వివాహమైనా కూడా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. నిర్దిష్ట ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మాత్రమే హనుమంతుడు వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం ఆయన భార్య సువర్చల తపస్సులో మునిగిపోవడంతో హనుమంతుడి బ్రహ్మచర్య దీక్షకు ఎలాంటి ఆటంకమూ కలగలేదు. పైగా హనుమంతుడు స్త్రీకి తల్లి మోదా ఇస్తాడట. తల్లి ఆయన పాదాలను తాకకూడదు కాబట్టి అలా మహిళలు ఆంజనేయుని విగ్రహాన్ని తాకకూడదనే ఆచారం వచ్చిందట. ఇక స్వామివారి ఎదుట దీపాలు వెలిగించడం నుంచి ప్రసాదం అందించడం, హనుమాన్ చాలీసా పఠించడం వంటివన్నీ మహిళలు ప్రశాంతంగా చేసుకోవచ్చు.

Share this post with your friends