ఛార్‌ధామ్ యాత్రకు వేళాయే.. భక్తుల సంఖ్యను పరిమితం చేసిన పర్యాటక శాఖ

ప్రతి ఒక్క హిందువుకూ ఛార్ దామ్ యాత్ర చేయాలనే కోరిక ఉంటుంది. ఈ యాత్ర ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కేదార్‌నాథ్, గంగోత్రి , యమునోత్రి తలుపులు మే 10న తెరుచుకోనుండగా.. మే 12 నుంచి బద్రీనాథ్ యాత్ర కూడా ప్రారంభం కానుంది. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భక్తుల సౌకర్యార్థం ఆస్తా పథాన్ని నిర్మించారు. ఈ యాత్ర ప్రయాణానికి కావల్సిన ఫార్మాలిటీలన్నీ పూర్తయ్యాయి. గతేడాది వరకూ చార్‌దామ్ యాత్రకు వెళ్లిన వారికి హెలి సేవ కేదార్‌నాథ్, హేమకుండ్‌లకు మాత్రమే ఉండేది. ఇప్పుడు బద్రీనాథ్‌కు కూడా పొడిగించారు.

ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకూ ఛార్‌దామ్ యాత్ర కోసం 19 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. గతేడాది 55 లక్షల మంది చార్ ధామ్‌ సందర్శనకు నమోదు చేసుకోవడంతో పోలీసులు, పర్యాటక శాఖ యాత్రీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోజువారీ భక్తుల సంఖ్యను ఈ ఏడాది పరిమితం చేసింది. ఈ క్రమంలోనే రోజుకు కేదార్‌నాథ్‌ను 15 వేల మంది.. బద్రీనాథ్‌ను 16 వేల మంది.. యమునోత్రిని 9 వేల మంది.. యమునోత్రిని 11 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ లెక్కన రోజుకు 51 వేల మంది ఛార్‌దామ్‌ను సందర్శించే అవకాశం ఉంది. భక్తుల ప్రయాణాలకు సంబంధించి ఆస్తా మార్గంలో కొన్ని మార్పులను అక్కడి ప్రభుత్వం చేస్తోంది.

Share this post with your friends