శివుడిని వేటితో అభిషేకించాలి? వాటి వలన ఎలాంటి ప్రయోజనం?

శివుడిని అభిషేక ప్రియుడని అంటారు. ఆయనను కేవలం నీళ్లతో అభిషేకించినా చాలట. చాలా సంతృప్తి చెందుతాడట. ఇక అభిషేకంలో పాలు, కొబ్బరి నీళ్లు, తేనే వంటితో పాటు పలు రకాల పదార్థాలను, ద్రవాలను వాడుతారు. ఇలా అభిషేకిస్తే మన పాపాలన్నీ తొలిగిపోయి.. మంచి జరుగుతుందని అంటూ ఉంటారు. ముఖ్యంగా అభిషేక ప్రియుడైన శివుడిని ఏ ఏ పదార్థాలతో అభిషేకించాలి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

శివుడికి ఆవు పాలతో అభిషేకం నిర్వహిస్తే కష్టాలన్నీ తొలిగిపోఖాయి.. సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తాడట.

చెరకు రసంతో శివుడిని అభిషేకిస్తే ఆర్థిక సమస్యలు తొలిగిపోయి ధనవృద్ధి కలుగుతుంది.

నువ్వుల నూనెతో శివుడిని అభిషేకిస్తే… అపమృత్యువు దరిచేరదు.

మెత్తని చెక్కరతో అభిషేకిస్తే జీవితంలోని దు:ఖం నాశనమై సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.

గరిక నీటితో శివుడికి అభిషేకం చేయడం వల్ల… నష్టపోయిందంతా తిరిగి పొందుతారు.

నిత్యం పెరుగుతో శివుడిని అభిషేకిస్తే.. మంచి ఆరోగ్యంతోపాటు బలం, యశస్సు లభిస్తుందట.

ఆవు నెయ్యితో శివుడిని అభిషేకించడం వలన నష్టాలన్నీ తొలగిపోయి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

Share this post with your friends