రక్తసిక్తమైన ఖడ్గంతో.. రాక్షసుడి ఖండిత శిరస్సుతో అరివీర భయంకరంగా కాళీ మాత..

పశ్చిమ బెంగాల్ ప్రజలు దుర్గమ్మను పుట్టింటికి ఆహ్వానిస్తూ.. అలాగే మెట్టినింటికి సాగనంపుతూ పాడే ఆగమన, నిగమన గీతికల గురించి తెలుసుకున్నాం. పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్‌కతాలో దుర్గాదేవి మరో రూపమైన కాళికను పూజిస్తారు. ఈ కాళిక మాత ఆలయంలో
అమ్మవారు అరివీర భయంకర రూపంలో మనకు దర్శనమిస్తుంది. ఇక్కడి అమ్మవారు మెడలో కపాల మాల ధరించి, ఒక చేతితో రక్తసిక్తమైన ఖడ్గాన్ని పట్టుకుని.. మరొక చేతితో రాక్షసుడి ఖండిత శిరస్సుతో.. శివుడి రూపంతో వచ్చిన ఆ రాక్షసుడిపై నిలబడి భయంకర రూపంలో మనకు దర్వనమిస్తుంది.

శుక్లపక్షం తొలిరోజున కాళికా మాత ఆలయంలో అర్ధరాత్రి కాళీ పూజ నిర్వహిస్తారు. ఆ సమయంలో ప్రతి ఇంట దివ్వెలు వెలగడంతో పాటు పెద్ద మొత్తంలో టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటారు. కాళికా మాతకు అనంత శక్తులున్నాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి. దీనిని కోల్‌కతా వాసులు అక్షరాలా నమ్ముతూ అమ్మవారికి మహాద్భుతంగా పూజలు నిర్వహిస్తారు. ఇలాంటి కాళీ మాత ఆలయాలు కోల్‌కతాలో దక్షిణేశ్వర్, కాళీ ఘాట్ అనే రెండు ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన కోల్‌కతా వాసులంతా స్వస్థలానికి చేరుకుని సంప్రదాయ దుస్తుల్లో దసరా మహోత్సవాన్ని జరుపుకుంటారు.

Share this post with your friends