ఏకాదశి రోజున అన్నం తినకూడదంటారు.. దీనికి కారణమేంటంటే..

హిందువుల ఏకాదశి తిథికి అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఈ రోజున విష్ణుమూర్తికి భక్తి శ్రద్ధలతోపూజలు నిర్వహిస్తూ ఉంటారు. విష్ణుమూర్తికి ఏకాదశి నాడు పూజలు నిర్వహిస్తే అన్ని విధాలుగా బాగుంటుందని నమ్మకం. ఏకాదశి నాడు ఉపవాసముండి స్వామివారిని స్మరించుకున్న వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ముఖ్యంగా ఏకాదశి నాడు అన్నం తినకూడదని అంటారు. దీనికి కారణమేంటి? దీనికి ఒక కథ ఉంది. మాతృ దేవత కోపం నుంచి తనను తాను రక్షించుకోవడానికి మహర్షి మేధా తన శరీరాన్ని విడిచిపెట్టడంతో ఆయనను ఖననం చేశారు. అనంతరం కొద్ది రోజులకే ఆయన శరీర భాగాలన్నీ భూమిలో కలిసిపోయాయి.

మహర్షి శరీర భాగాలను ఖననం చేసిన ప్రదేశంలో బియ్యం, బార్లీ పెరిగాయట. దీంతో బియ్యాన్ని ఒక మొక్కగా కాకుండా జీవి రూపంగా పరిగణిస్తూ ఉంటారు. మహర్షి మేధ భూమిపై మరణించిన రోజు ఏకాదశి. కాబట్టి ఆ రోజున అన్నం తినకూడదని అంటారు. ఏకాదశి రోజున అన్నం తిన్న వారి తదుపరి జన్మ సరీసృపాల రూపంలో ఉంటుందట. కాబట్టి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం తినకూడదని అంటారు. అలాగే మాంసాహారం, మద్యం వంటి వాటిని కూడా ముట్టకూడదు. వీటితో పాటుగా ఏకాదశి రోజున ఎవరినీ ఇబ్బంది పెట్టడం కానీ దూషించడం కానీ చేయకూడదు.

Share this post with your friends