కిందపడిన పారిజాత పుష్పాలనే పూజకు ఎందుకు వాడాలి?

వాస్తవానికి కింద పడిన పువ్వులు పూజకు పనికిరావు. కానీ పారిజాత పుష్పాల విషయానికి వస్తే కిందపడిన పువ్వులతోనే పూజ చేయాలి. కింద పడిన పారిజాత పుష్పాలతోనే దేవుడిని పూజ చేయాలని ఎందుకు చెబుతారో తెలుసా? పారిజాత వృక్షం దైవ స్వరూపంగా పరిగణించబడుతుంది. ఈ పుష్పాలతో పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర మథనంలో ఉద్భవించింది. తర్వాత విష్ణువు స్వర్గానికి తీసుకెళ్లగా, సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తెచ్చాడు.

ఎందుకు కిందపడిన పుష్పాలనే వాడాలంటే.. సాధారణంగా పూలను అప్పటికప్పుడు కోసి పూజ చేస్తారు. కానీ పారిజాత పువ్వు మాత్రం భూమిని తాకిన తర్వాత మాత్రమే స్వామికి సమర్పించాలి అని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఇది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వృక్షం. అందుకే కిందపడిన పువ్వు భూమిని తాకిన తర్వాతే పవిత్రమవుతుంది. కిందపడిన పువ్వులను మాత్రమే ఆవుపేడతో అలికిన నేల నుండి ఏరుకొని దేవుడికి సమర్పించాలి.

పారిజాతం ఇంటి ఆవరణలో ఉంటే… ఆ ఇంటిలో ఎప్పుడూ సిరి సంపదలు, ఐశ్వర్యం నిలుస్తాయి అని పురాణ వచనం.

Share this post with your friends