ఏ గ్రంథానికీ లేని విశిష్టత భగవద్గీతకే ఎందుకు?

భగవద్గీత ఇతర ఏ గ్రంథాలతో పోల్చుకున్నా విశిష్ట స్థానం ఉంటుంది. అసలు లోకంలో మరే ఇతర గ్రంథాలకి లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’కే ఎందుకు? అంటే దానికి చాలా కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. అవతారమూర్తుల జననం వెనుక లోక హితమే ఉంటుంది. కాబట్టి వారి జన్మదినాన్ని కాలం చేసిన తర్వాత కూడా ‘జయంతి’గా జరుపుకుంటూ ఉంటాం. అలాగే భగవద్గీత కారణంగా జరిగిన మహోపకారం వల్ల గీతా జయంతిని జరుపుకుంటూ ఉంటాం. మరి ఏ ఒక్క గ్రంథానికైనా ఇలా జయంతి జరపడం ఉందా? మరి భగవద్గీత వల్ల జరిగిన ప్రయోజనం ఏంటంటారా? చాలా ఉంది.

సుమారు 5200 ఏళ్ల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో.. కలియుగాన్ని కారుమేఘంలా కమ్మేస్తున్న అజ్ఞానాన్ని తొలగించేందుకు భగవద్గీత ఉద్భవించింది. ఆత్మ, పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించింది. మనిషిని ముక్తి మార్గం వైపు నడిపించింది. భగవద్గీత చదివితే వైరాగ్యంతో జీవితంపైనే ఆసక్తి పోతుందని కొందరు చెబుతారు కానీ గీతా సారాంశం విన్న తర్వాతే అర్జనుడు ఆత్మస్థైర్యంతో గాంఢీవాన్ని ధరించి కదన క్షేత్రానికి వెళ్లాడు. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్లు, మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచంపై దండయాత్రలు చేసినా విధ్వంసం సృష్టించినా సజీవంగానే ఉంది.

Share this post with your friends