దేవుడి దగ్గర పూజలో పువ్వులను ఎందుకు వినియోగిస్తాం?

గుడికి వెళుతున్నాం.. లేదంటే ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాం అనగానే మనం ముందుగా పూలను తెచ్చుకుంటాం. అసలు ఈ పూలను పూజలో ఎందుకు వినియోగిస్తాం? వాటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? అనే విషయాన్ని మాత్రం పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అనాదిగా వస్తోంది కాబట్టి ఫాలో అయిపోతూ ఉంటారు. మంచి మనసుతో.. భక్తిపూర్వకంగా పండో ఫలమో లేదంటే జలం సమర్పించినా మనస్ఫూర్తిగా స్వీకరిస్తానని నాడు గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. దీనిని బట్టి దేవతలు పూలకు ఎంత ప్రాధాన్యమిస్తారనేది అర్థమవుతోంది.

ప్రకృతి అందమైన సృష్టి పువ్వులు. అందుకే వీటిని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాంయ. అంతేకాకుండా మరో విషయం కూడా ఉంది. పువ్వులు ఉన్న చోట సానుకూల శక్తులకు అనుకూలంగా ుంటుంది. అలాగే ప్రతికూల శక్తులేవి ప్రవేశించలేవు. అందుకే పువ్వులను పూజలోనే కాకుండా శుభ సందర్భం ఏదైనా వాడుతూ ఉంటాం. ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నా కూడా త్వరగా కోలుకోవాలంటూ పూల బొకే ఇస్తాం. అలాగే వేడుక ఎలాంటిదైనా పువ్వులతో ఆ ప్రదేశాన్ని అలంకరిస్తూ ఉంటాం. అది పువ్వులకు ఉండే గొప్పతనం. అయితే దేవుడి పూజలో మాత్రం వాడిపోయిన, నలిగిపోయిన. కాడ లేని పువ్వులను వాడకూడదు.

Share this post with your friends