గుడికి వెళుతున్నామంటే కొబ్బరికాయ తప్పనిసరిగా తీసుకెళతాం. కొబ్బరికాయను ఒక్క భగవంతున్ని పూజించే సమయంలోనే కాదు.. యజ్ఞ యాగాదుల్లోనూ.. వ్రతాల్లోనూ.. శుభకార్యాల్లోనూ తప్పనిసరిగా కొబ్బరి కాయను కొడతాం. అసలు ఎందుకు కొబ్బరికాయను కొట్టాలి? అంటే కొబ్బరికాయలోని పెంకు నుంచి ప్రతిదీ మనకు ఏదో ఒక సూచన. కొబ్బరికాయపై ఉన్న పెంకు మనిషిలోని అహంకారానికి సూచన. లోపలున్న కొబ్బరిని మన మనసుతో పోల్చుతారు.
ఎప్పుడైతే కొబ్బరికాయను భగవంతుని ముందు మనం కొడతామో.. అప్పుడే మన అహంకారాన్ని విడనాడుతున్నట్టుగా భావించాలి. లోపలున్న తెల్లని కొబ్బరి మాదిరి మన మనసును నిష్కల్మషంగా.. సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని అర్థం. ఇక కొబ్బరికాయలో ఉండే నీరు మాదిరిగా మన జీవితాలను నిర్మలంగా ఉంచుమని భగవంతున్ని కోరుతున్నట్టు అర్థం. కొబ్బరి కాయను మానవ శరీరంతో పోల్చుతారు. కొబ్బరి బోండం పైనున్న దానిని మన చర్మంతోనూ.. పీచులోని మన మాంసం గానూ.. పెంకెను ఎముకలతోనూ.. కొబ్బరిని ధాతువు గానూ పరిగణిస్తూ ఉంటారు.