అక్కడి మహాలక్ష్మి అమ్మవారికి డబ్బు, నగలను ఎందుకు సమర్పిస్తారు?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు ఆనుకుని ఉన్న రత్లాం జిల్లాలోని మనక్ ప్రాంతంలో మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇక్కడ దోపావళి సమయంలో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు నైవేద్యానికి బదులుగా డబ్బు, బంగారం, వెండిని ఇస్తారట. అయితే అసలు ఎందుకు భక్తులు అమ్మవారికి డబ్బు, నగలు సమర్పిస్తారో తెలుసుకుందాం. ఇలా అమ్మవారికి డబ్బు, నగలను సమర్పిస్తే తమ సంపద మరింత పెరుగుతుందని భక్తుల నమ్మకమట. ఈ క్రమంలోనే అమ్మవారికి పెద్ద మొత్తంలో డబ్బు, నగలను సమర్పిస్తారట.

ఇక భక్తులు అమ్మవారికి ఏది సమర్పించినా వెంటనే ఆలయ సిబ్బంది సదరు భక్తుడి పేరు, అతని ఫోటోతో పాటు వారు ఏం ఇచ్చారనేది లెడ్జర్‌లో నమోదు చేస్తారు. దీపావళి పండుగ వచ్చిన ఐదవ రోజున లెడ్జర్‌లో నమోదు చేసిన సమాచారం ఆధారంగా భక్తులకు సమర్పించిన డబ్బు, నగలకు లక్ష్మీదేవికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఇక భక్తులు సైం ప్రసాదంగా అందుకున్న డబ్బు, నగలను ఎప్పుడూ ఖర్చు చేయరట. దీనికి కారణంగా అవి ఇంట్లో ఉంటే సంపదతో ఇల్లు కళకళలాడుతుందని నమ్మకమట.

Share this post with your friends