నమస్కారం ఎందుకు చేయాలి? ఎవరికి ఎలా చేయాలి?

భారతీయ సంప్రదాయంలో హాయ్, హలోలు లేవు. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పలకరించుకునే విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. మనదేశంలో పలకరించుకునే విధానంలో ప్రత్యేక శైలి ఉంటుంది. ఒకరినొకరు కలవగానే చక్కగా రెండు చేతులూ జోడించి నమస్కరించుకుంటూ ఉంటారు. నమస్కారంలో నమ అంటే వంగి ఉండటం అని అర్థం. వంగి చేతులు జోడించుకుని చేసేదే నమస్కారం. అసలు ఎందుకు ఇలా నమస్కరించుకోవాలి. సింపుల్‌గా హాయ్ అనో హలో అనో చెప్పుకుంటే అయిపోతుంది కదా అని అంటారా?

అలా ఒకరినొకరు ఎదురు పడినప్పుడు నమస్కరించుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితి. ఇక నమస్కరించడంలో పద్ధతి ఎదుటి వారిని బట్టి మారుతూ ఉంటుంది. మన ఎదురుగా దేవతలుంటే రెండు చేతులు సహస్రారంపై.. పెద్దలు ఎదురు పడితే నుదుటిపై రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. ఇక సాటి వారికైతే హృదయ స్థానంలో రెండు చేతులు జోడించి నమస్కరించాలి. ఇక తల్లి, తండ్రి, గురువు, దైవం వంటి వారికైతే సాష్టాంగ నమస్కారం చేయాలి. దీనిని మరో పేరుతో కూడా పిలుస్తారు. అదే దండ ప్రణామం. అంటే కర్రలాగా నేలను అష్టాంగాలు భూమికి తగిలేలా నమస్కరించడం. స్త్రీలు మాత్రం పంచాగాలతో నమస్కరించాల్సి ఉంటుంది.

Share this post with your friends