ముక్కోటి దేవతలెందుకు? ఒక్కరిని పూజిస్తే సరిపోదా?

భగవంతుడు ఒక్కడేనని చెబుతారు. మళ్లీ ముక్కోటి దేవతలని కూడా అంటారు. అలాగే ఒక్క దేవతను మాత్రమే ఉపాసించి ఊరుకోం. ప్రతి దేవతనూ కొలుస్తూనే ఉంటాం. అలా ఎందుకు? ఒకరిని ఉపాసిస్తే సరిపోదా? అనే సందేహం చాలా మందికి రావొచ్చు. దీనికి కారణమేంటో తెలుసుకుందాం. పంచ భూతాలలో ప్రతిదీ ముఖ్యమే. ఏది లేకున్నా జీవించలేం. అలాగే మానవ అవసరాలకు అనుగుణంగా మనం ఒక్కో దేవతను పూజించుకుంటున్నాం. అంటే మన అవసరాలకు అనుగుణంగా దేవతలను విభజించుకుంటున్నాం. మన అవసరాలు ఒక్కరితో సరిపోవు కాబట్టి ప్రతి దేవతను ఆరాధించాలని పండితులు చెబుతున్నారు.

ముక్కోటి దేవతలెందుకు? ఒక్కరిని పూజిస్తే సరిపోదా?
ముక్కోటి దేవతలెందుకు? ఒక్కరిని పూజిస్తే సరిపోదా?

మన వ్యవస్థను తీసుకుంటే ప్రధాని మొదలు చిన్న స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ అవసరమే. అలాగే దేవతలంతా కూడా మనకు అవసరమే. మన అవసరాలకు అనుగుణంగా దేవతలను విభజించుకున్నాం. తొలుత గ్రామదేవత.. ఆ దేవత మన అవసరాన్ని తీర్చలేకుంటే పైస్థాయి దేవతలకు సిఫార్స్ చేస్తుందట. అలాగే పంచ భూతాలలో మనకు ప్రతిదీ ముఖ్యమే. ఏ ఒక్కటి లేకున్నా జీవించలేం. కాబట్టి ఒక్కదాన్ని మాత్రమే పూజించి వదిలేయలేం. అలాగే ముక్కోటి దేవతలూ మనకు అవసరమే. అయితే అధి దేవత మాత్రం ఒక్కరేనని చెబుతారు.

Share this post with your friends