భాగవతంలో చిన్ని కృష్ణుడి లీలల గురించి మనం చాలానే విన్నాం. చాలా మంది రాక్షసులను సంహరించాడు. వారిలో ఒకరు అగుడు. ఈ అఘుడి సోదరులైన బకుని, పూతనలను బాల కృష్ణుడు సంహరించాడు. అయితే సంహరించింది ఎవరో అఘుడికి తెలియదు. ఎవరో గోపబాలుడు సంహరించాడనుకుని గోకులానికి వచ్చాడు. అక్కడ బలరామకృష్ణులు, పిల్లలతో ఆడుకుంటున్నారు. వారిలో తన సోదరులను సంహరించినది కృష్ణుడేనని అఘుడు గుర్తించాడు. కృష్ణుడిని సంహరించాలని కొండ చిలువ రూపాన్ని అఘుడు ధరించాడు.
ఆ తరువాత తన నోటిని గుహలాగా తెరిచాడు. చిన్నారులంతా చూసి అదేదో గుహ అనుకుని అఘుడి నోటిలోకి వెళ్లాడు. చిన్ని కృష్ణుడు ఆ తరువాత మెల్లగా కొండ చిలువ నోటిలోకి వెళ్లి తన శరీరాన్ని పెద్దగా చేశాడు. దీంతో కొండ చిలువ నోరు మూతపడింది. దానికి ఊపిరాడలేదు. మొత్తానికి కొండ చిలువకు తల పగిలింది. దీంతో కృష్ణుడు సహా గోపబాలురంతా బయటకు వచ్చేశారు. అయితే అఘుడికి సైతం తల పగలడంతో శాప విమోచనం కలిగింది. ఆ తరువాత శ్రీ కృష్ణుడిలో లీనమయ్యాడు. అలా అఘుడికి శాప విమోచనం కలిగింది.