వరలక్ష్మీదేవి ఎవరు? శ్రావణంలో వ్రతం ఎప్పుడు ఆచరించాలి?

శ్రావణ మాసం శివకేశవులతో పాటు మహిళలకు కూడా ప్రీతిపాత్రమైన మాసమే. ఈ నెలలో స్త్రీలు నోములు, వ్రతాలూ చేసుకుంటారు. వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటివి చేసుకుంటారు. ఈ మాసంలోనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఎక్కువ మంది చేసుకుంటారు. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు ఆచరిస్తారు. వరలక్ష్మీదేవి ఎవరు? అలాగే ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి. వ్రతం తేదీ, శుభ సమయం గురించి తెలుసుకుందాం. వరలక్ష్మీదేవి మరెవరో కాదు.. శ్రీ మహా విష్ణువు భార్య. ఈ అమ్మవారిని ఉద్దేశిస్తూ చేసేదే వరలక్ష్మీ వ్రతం.

స్త్రీలు జరుపుకునే అరుదైన పండుగలలో వరలక్ష్మి వ్రతం ఒకటి. ఈ వ్రతం చేసుకున్న వారికి సంపదతో పాటు శ్రేయస్సు కూడా అందుతుందట. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం వరలక్ష్మీవ్రతం జరుపుకోవచ్చు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకునేందుకు విశిష్టమైన రోజు. ఈరోజున వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకుంటే ఫలితం మరింత ప్రబావవంతంగా ఉంటుంది. ఈ రోజున ఒక్క లక్ష్మీదేవికి చేసే పూజ.. అష్ట లక్ష్మీ పూజతో సమానంగా చెబుతారు. వరలక్ష్మీ వ్రతం ఆచరించేవారు ఉపవాసం ఉంటారు. ఇలా ఉండటం వలన అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని విశ్వాసం.

Share this post with your friends