గుడికి వెళ్లిన భక్తులు చాలా మంది గుడి వెనుక భాగాన్ని కూడా మొక్కుతుంటారు. ఇలా ఎందుకు మొక్కుతారనే విషయం కూడా తెలిసి ఉండదు. అందరూ మొక్కుతున్నారు కాబట్టి మనం కూడా మొక్కుతున్నాం అనుకుంటారు. ఏదో మంచిని ఆశించి మొక్కుతుంటారు కొందరు. అయితే ఇలా మొక్కకూడదని అక్కడ రాక్షసులుంటారని కొందరు చెబుతుంటారు. ఈ కారణంగా కొందరు మొక్కరు. మరి ఇందులో నిజమెంత? నిజంగానే గుడి వెనుక రాక్షసులు ఉంటారా? అయితే ఆలయ వెనుక భాగాన్ని మొక్కడం వెనుక ఓ కథ ఉంది.
గుడిలో మూలవిరాటు ఉండే గర్భాలయాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. గర్భాలయంలో మూల విరాట్టుని ప్రతిష్టించడంలో కొన్ని లెక్కలుంటాయి. గోడల మధ్య కాకుండా వెనుక గోడకి దగ్గరగా మూలవిరాట్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. నిత్యం నిర్వహించే పూజల మంత్రశక్తి స్వామివారి పాదపీఠం కింద ఉన్న యంత్రంలోకి ప్రవేశిస్తుందట. ఆ మంత్ర శక్తి ప్రభావం కారణంగా స్వామివారి విగ్రహం నుంచి తప: కిరణాలు నలుదిక్కులా ప్రసరిస్తాయి. అయితే స్వామివారి విగ్రహం వెనుక గోడకు అత్యంత సమీపంలో ఉంటుంది కాబట్టి దానికి మంత్ర శక్తి ఎక్కువగా ఉంటుందట. కాబట్టి వెనుక గోడకు రాక్షసులు ఉండరు.. ఏమీ ఉండదు. కేవలం భక్తులు అక్కడ మొక్కితే స్వామివారి తప: శక్తిని పొందుతారట.