రామాయణం గురించి మీకు అన్ని విషయాలు తెలుసా రామాయణాన్ని ఆది కావ్యం అంటారు. రాముడి యొక్క ఆయనం కనుక వాల్మీకి మహర్షి ఈ పేరు పెట్టారట. సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ అనే పేర్లను కూడా పెట్టారు. రామాయణంలో 24 వేల శ్లోకాలు.. మొత్తం 6 కాండలు ఉన్నాయి. అవేంటంటే.. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు. ఈ ఆరు కాండల మీద ఒక కాండ.. ఉత్తర కాండ. రాముడు ‘దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ’ అంటే 11 వేల ఏళ్ల పాటు ఈ భూమండలంపై ఉంటానని బాలకాండలో చెప్పాడు కాబట్టే రావణ సంహారం తర్వాత కూడా తన అవతారాన్ని చాలించలేదట.
ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడట. ఆ తరువాత బ్రహ్మ దేవుడి కారణంగా జరిగిన రామాయణం అంతా కనిపించిందట. ఇక వరమిస్తున్నానని.. రామాయణాన్ని రాయాలంటూ బ్రహ్మే సూచించారట. ఈ భూమిపై నదులు, పర్వతాలున్నంత కాలం రామాయణం ఉంటుందని తెలిపారట. అప్పుడు వాల్మీకి రామాయణం రాయడం ప్రారంభించారట. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని వాల్మీకి రచించారు.