పెరటాసి మాసంలో ఏ వారాలు కీలకమైనవంటే..

పెరటాసి మాసం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ మాసం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనది. శ్రీనివాసుడిగా శ్రీ మహావిష్ణువు ఈ మాసంలోని శ్రవణ నక్షత్రంలో అవతరించాడు. ముఖ్యంగా ఈ మాసంలో శనివారాలకు అత్యంత ప్రాధాన్యముంది. వాస్తవానికి శ్రీనివాసుడికి అన్ని శనివారాలూ ప్రీతికరమైనవే కావడం విశేషం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. మూడవ శనివారం అత్యంత ముఖ్యమైనది. ప్రతి శనివారం పిండి దీపాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ముందు వెలిగించి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుచుకుంటారు.

కొందరికి అన్ని శనివారాలు చేయడానికి అవదు. అలాంటి వారు ఒక్క మూడవ శనివారం మాత్రం తప్పకుండా స్వామివారికి పిండి దీపాన్ని సమర్పించి పూజిస్తారు. అయితే ఈ పిండి దీపాన్ని అన్యమనస్కంగా వెలిగించకూడదు. శ్రీ వేంకటేశ్వరునిపై భక్తితో శ్రద్ధగా చేయాలి. పావు శేరు బియ్యాన్ని మూడు గంటల పాటు నీటిలో నానబెట్టి ఆపై నీళ్లన్నీ వడగట్టి బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. అనంతరం ఈ బియ్యాన్ని మెత్తని పిండిలా చేసి దానితో పిండి దీపం వెలిగించాలి. పిండి దీపాన్ని శ్రీనివాసుడికి సమర్పిస్తున్నాం కాబట్టి అంతా కూడా చాలా జాగ్రత్తగా మడిగానే చేయాల్సి ఉంటుంది.

Share this post with your friends