ఈ మొక్కలలో ఏది మీ ఇంట్లో ఆర్థిక వృద్ధి ఉంటుందట..

మొక్కలు మనకు ఆక్సీజన్‌ను అందించి ఆరోగ్యంగా ఉంచడానికే కాదు.. శ్రేయస్సుకు కూడా ఉపయోగపడతాయి. మన ఇంట ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా చేస్తాయి. అలాంటి మొక్కలేవో చూద్దాం. జ్యోతిష్యులు, వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం కొన్ని మొక్కలు సంపదను వృద్ధి చేస్తాయట. వాటిలో మొదటి తులసి. ఈ మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి అని చెబుతారు. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల సంవత్సరం మొత్తం చాలా శుభప్రదమని చెబుతారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. జమ్మి చెట్టు సైతం ఇంట ఉంట చాలా మంచిదట. శివుడి అనుగ్రహం లభిస్తుందట. అలాగే శనిదోషం నుంచి విముక్తి లభిస్తుందట.

జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిదట. ఈ మొక్క గణపతికి చాలా ఇష్టమైనదని చెబుతారు కాబట్టి ఇది ఇంట ఉంటే సంతోషం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయట. నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట ఉండదట. అలాగే ఆర్థిక వృద్ధి కోసం మనీ ప్లాంట్‌ను పెంచుకుంటే మంచిదట. క్రాసుల మొక్క లేదంటే జడే మొక్కను ఇంట పెంచుకుంటే సానుకూల శక్తి పెరుగుతుందట. ప్రతికూల శక్తి తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు పోతాయట. అలాగే ఆర్థికంగా పుంజుకుంటారట. కాబట్టి వెంటనే ఈ మొక్కలలో దేనినో ఒక దానిని తెచ్చి ఇంట పెంచుకుంటే ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయట.

Share this post with your friends