ప్రస్తుత తరుణంలో స్నానపానాదుల కోసం సమయం కేటాయించేంత తీరిక, సమయం ఎవరికీ పెద్దగా లేదు. అంతా హడావుడే.. ఏదో స్నానం చేశామంటే చేశామనిపించుకోవడం అంతే. ఏదో నాలుగు మగ్గుల నీటిని ఒంటిపై వేసుకుని మమ అనిపించేయడం.. మరికొందరైతే ఇంకా దారుణం శరీరం కూడా సరిగా తడవదు. ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్క పనికి ఒక విధి విధానం ఉంటుంది. దాని ప్రకారమే నడుచుకోవాలి. స్నానానికి సైతం ఓ విధానం ఉంటుంది. ఆ విధానాలు ఎన్ని రకాలు? అవేంటో చూద్దాం.
స్నానాలన్నింటిలోకి ఉత్తమమైనది సుమద్ర స్నానమట. ఇందులో ఉండే ఉప్పు శరీరంలోని మలినాలను తొలగిస్తుందట. ఇక నదీ స్థానం కూడా ఉత్తమమైనదేనట. నదీ స్నానం చేస్తే చర్మరోగాలు దరి చేరవట. ఇక ఈ నదిలోని నీరు.. కొండలు, చెట్లు, అడవుల గుండా ప్రవహిస్తుంది కాబట్టి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే పుష్కర స్నానం చేస్తే పాప విముక్తి కలుగుతుందట. ముక్కోటి దేవతలు పుష్కర స్నానం ఆచరిస్తారట. ఇంట్లో స్నానం చల్లటి లేదంటే బాగా వేడి నీటితో చేయకూడదు. గోరు వెచ్చటి నీటితో చక్కగా హడావుడి లేకుండా చేయాలట. స్నానం చేసిన తర్వాత దాని సంతృప్తిని అనుభవించడం నేర్చుకోవాలట.