ఏ లోహంతో చేసిన విగ్రహాలను మన ఇంట్లో పెట్టుకుంటే కలిసొస్తుంది?

మన ఇంట్లోని విగ్రహాలను ఏ దిక్కులో పడితే ఆ దిక్కులో ఉంచకూడదు అంటారు. వాస్తు శాస్త్రంలో దిక్కులను కీలకంగా భావిస్తారు. ఏదైనా సరైన దిశలో ఉంటేనే ఫలితం లభిస్తుంది. అలాగే ఏ విగ్రహాలను పెట్టుకుంటే కలిసొస్తుందనేది కూడా తెలుసుకోవాలి. అయితే ఇంట్లో అందం కోసమే కాకుండా అదృష్టం కోసం కూడా కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటం. అవేంటి? వాటిని ఏ దిశలో ఉంచాలో చూద్దాం. హిందూమతంలో ఆవును గోమాతగా పూజిస్తాం. ఆవుదూడల విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటాం. ఇది ఇత్తడిదైతే మంచిది. ఇది ప్రతికూల శక్తిని హరించి మనకు అంతా కలిసొచ్చేలా చేస్తుంది.

ఇక తాబేలు ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదట. అయితే మనం లోహపు తాబేలును ఇంట్లో పెట్టుకుంటే మంచిదట. ఇక దీనిని ఇంట్లోని డ్రాయింగ్ రూమ్‌కు ఉత్తరం లేదా తూర్పు దిశలో పెట్టాలి. ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సిరి సంపదలకు లోటు ఉండదట. అయితే ఇది ఇత్తడి లేదా వెండిదైతే మంచిదట. హంసల జతను పెట్టుకోవడం వలన కూడా మనకు మంచి జరుగుతుందట. దీనిని డ్రాయింగ్ రూమ్‌లో పెట్టాలి. లోహపు చేపలను ఇంట్లో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక మనపై ఉంటుందట. అయితే ఈ లోహం వెండి లేదా ఇత్తడి అయి ఉండాలట.

Share this post with your friends