దేవుడి గదిలో ఏ విగ్రహాలను పెట్టకూడదు?

పూజాగదిలో విగ్రహాలు పెట్టొచ్చా? పెడితే ఏ విగ్రహాలు పెట్టాలి? ఏ విగ్రహాలు పెట్టకూడదనే సందేహం ఉంటుంది. వాస్తవానికైతే పూజ గదిలో అనేక మంది దేవుళ్ల, దేవతల విగ్రహాలు, ఫోటోలు ఉంచుతారు. అయితే పూజగదిలో కొందరు దేవుళ్ల విగ్రహాలు లేదంటూ ఫోటోలు పెట్టకూడదట. దాని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చోటు చేసుకుంటుందని అంటారు. ఇంతకీ ఏ దేవుళ్ల విగ్రహాలు లేదా ఫోటోలు పూజ గదిలో పెట్టకూడదో చూద్దాం. భైరవనాథుడు అంటే శివుని ఉగ్ర అవతారమేనని చెబుతారు. ఇంకా ఆయనను కాల భైరవుడని కూడా పిలుస్తుంటారు. కాలభైరవ విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదట.

కాలభైరవ విగ్రహాన్ని బయట ఉంచి మాత్రమే పూజ చేయాలట.అలాగే మహంకాళి ఫోటో లేదా విగ్రహాన్ని పూజ గదిలో పెట్టకూడదట. మహంకాళిని పార్వతి దేవి యొక్క ఉగ్ర రూపంగా పరిగణిస్తారు. మహంకాళి పార్వతీ దేవి యొక్క అత్యంత భయంకరమైన రూపం కాబట్టి ఇంట్లో ఉంచితే అశాంతి పెరుగుతుందట. శనిదేవుని విగ్రహాన్ని సైతం ఇంట్లో పెట్టకూడదట. అలాగే రాహువు, కేతువులను ఫోటోలను సైతం ఇంట్లో పెట్టకూడదు. ఇక తలస్నానం అయిన వెంటనే తడి జుట్టుతో పూజ గదిలోకి అడుగు పెట్టకూడదు. దేవుని గదిలో భోజనం చేయడం, నిద్రించడం వంటివి చేయకూడదని పండితులు చెబుతారు.

Share this post with your friends