భారతదేశంలో హిందూ దేవాలయాకైతే కొదువ లేదు. ఇతర దేశాల్లోనూ ఉన్నాయి కానీ మన దేశంలో ఉన్నంత పెద్ద మొత్తంలో అయితే ఉండవు. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా? కంబోడియా దేశం అంకోర్‌లోని సిమ్రిస్ నగరంలో మెకాంగ్ నది ఒడ్డున ఉంది. ఇది శ్రీ మహా విష్ణఉవు ఆలయం. దాదాపు 2 కిలో మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయం పాత పేరు యశోదపూర్. క్రీ.శ. 1112 నుంచి 1153 కాలంలో సూర్యవర్మన్ II ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయ మరో విశేషాలు ఏంటంటే.. అంగ్‌కోర్‌వాట్ ప్రపంచంలోని అతి పెద్ద హిందూ దేవాలయమే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన స్మారకం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో కూడా చేరింది. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడి విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు చాలా ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయంలో మొత్తం 6 శిఖరాలు ఉన్నాయి. గోడలపై హిందూ దేవతల విగ్రహాలు కూడా చెక్కబడ్డాయి.ఇక ఆలయ వైభవం, వాస్తుశిల్పం చూడటానికి రెండు కళ్లూ చాలవు.