మనం ఇంతకు ముందు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో రంగులు మారే శివలింగం గురించి తెలుసుకున్నాం. అలాగే పలు ఆసక్తికర ఆలయాల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అమావాస్య నాడు ఒక రంగులో.. పౌర్ణమి నాడు మరో రంగులో కనిపించే శివలింగం గురించి తెలుసుకుందాం. సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది సోమారామం. దేశంలో ఉన్న స్పటికలింగాల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఇది భీమవరం పట్టణానికి కేవలం 2 కి.మీ దూరంలో ఉంటుంది.
సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు ప్రతిష్టిత లింగం కాబట్టి ఈ క్షేత్రాన్ని సోమేశ్వర క్షేత్రమని.. ఇక్కడి శివయ్యను సోమేశ్వరుడని పిలుస్తారు. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడి సోమేశ్వరుడు నిత్య పూజలందుకుంటూ ఉంటాయి. అయితే శివలింగం అమావాస్య నాడు నలుపు రంగులోనూ.. పౌర్ణమి నాడు గోధుమ వర్ణంలోనూ దర్శనమిస్తూ ఉంటుంది. దీనికి కారణం కూడా ఈ శివయ్యను చంద్రుడు ప్రతిష్టించడమేనని అంటారు. అందుకే ఇక్కడి శివలింగం చంద్రుడిని అనుసరిస్తూ రంగు మారుతూ ఉంటుందట. ఇలా శతాబ్ద కాలంగా జరుగుతోందని.. ఈ మార్పులను గమనించాలంటే అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఈ ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది.